Hyderabad: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోటాపోటీ పోస్టర్లు..

Hyderabad: హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం రేగింది.

Arun Chilukuri
Published on: 28 July 2023 4:44 PM IST
BRS and Congress Competition Posters are Going Viral on Social Media
X

Hyderabad: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోటాపోటీ పోస్టర్లు..

Hyderabad: హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం రేగింది. టీపీసీసీ చీఫ్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కనపడటంలేదంటూ పోస్టర్లు వెలిశాయి. నగరంలోని పలుచోట్ల గోడలపై ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. 2020లో నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తినప్పుడు సందర్శించలేదని, ఇప్పుడు కూడా వరద బాధితులను పరామర్శించడానికి రేవంత్ రెడ్డి రాలేదంటూ పోస్టర్లు అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. సీఎం కేసీఆర్ కనపడటం లేదంటూ పోస్టర్లు వెలిశాయి. 2020, 2022, 2023.. సంవత్సరం ఏదైనా కనపడని ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు అంటించారు. ఆచూకీ తెలియక అయోమయంలో కార్యకర్తలంటూ పోస్టర్లలో ఉంది. ఈ పోటాపోటీ పోస్టర్ల దృశ్యాలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story